ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ' దేశముదురు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న బ్యూటీ హన్సికా మోత్వాని. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల భర్తతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ ను ప్రారంభించిన ఈ హన్సిక.. టాలీవుడ్ లోకి రీ ఎంట్రి ఇచ్చింది. లేటెస్ట్ గా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కట్టడం 'చార్మినార్' వద్ద ఈ బ్యూటీ మెరిసింది.
చార్మినార్ సెట్స్‌లో హన్సిక..
హన్సిక చార్మినార్ వద్ద షూటింగ్ లో పాల్గొన్న వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంప్రదాయ వస్త్రధారణలో, అత్యంత నిరాడంబరంగా కనిపించింది. అయితే, ఆమె అక్కడ కనిపిస్తున్న తీరు చూస్తుంటే ఏదో పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ జరుగుతున్నట్లు అర్థమవుతోంది. దీనికి తోడు, క్రియేటివ్ యాక్టర్ జె.డి. చక్రవర్తి కూడా అదే షూటింగ్ స్పాట్‌లో కనిపించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. హన్సిక, జె.డి. చక్రవర్తి కలిసి ఒకే ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారా? లేదా ఏదైనా స్పెషల్ సాంగ్ కోసమా? అనే చర్చలు అభిమానుల్లో జోరుగా సాగుతున్నాయి.
తెలుగు తెరపై మళ్ళీ హన్సిక మ్యాజిక్..
'దేశముదురు' చిత్రంతో టాలీవుడ్‌ను ఊపేసిన హన్సిక.. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే, గత కొంతకాలంగా ఆమె తెలుగు సినిమాలకు దూరంగా ఉండటంతో, అభిమానులు ఆమెను మళ్ళీ వెండితెరపై చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆమె చార్మినార్ దగ్గర ప్రత్యక్షం కావడంతో, ఆ లాంగ్ గ్యాప్ త్వరలోనే ముగియబోతోందని సినీ వర్గాలు అంటున్నాయి.
ఏంటా ప్రాజెక్ట్?
ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ ఒక సినిమా కోసమా, వెబ్ సిరీస్ కోసమా లేక ఏదైనా భారీ బ్రాండ్ యాడ్ ఫిల్మ్ కోసమా అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, సెట్‌లో ఉన్న క్రూ మెంబర్స్, భారీ ఎక్విప్‌మెంట్ చూస్తుంటే ఇది ఏదో క్రేజీ ప్రాజెక్ట్ అని స్పష్టమవుతోంది. ముఖ్యంగా జె.డి. చక్రవర్తి లాంటి పవర్ ఫుల్ పెర్ఫార్మర్ తోడవ్వడంతో, ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఏది ఏమైనా, చార్మినార్ సాక్షిగా జరుగుతున్న ఈ షూటింగ్ అప్‌డేట్ ఇప్పుడు తెలుగు సినీ ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అసలు హన్సిక మళ్ళీ తెలుగు ప్రేక్షకులను ఎలా అలరించబోతుందో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..
