విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న కమల్ హాసన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘వీరధీరసూరన్’ ఫేమ్ ఎస్.యు. అరుణ్ కుమార్‌తో కలిసి ఆయన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ కలిసి నిర్మించనున్నారు.
ఈ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్‌లో కమల్ హాసన్ పూర్తిగా కొత్త తరహా లుక్‌లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్, గడ్డం, బ్లాక్ షర్ట్, ఆలివ్ గ్రీన్ ట్రౌజర్స్‌తో ఆయన కనిపిస్తున్నారు. లుక్ టెస్ట్‌లో భాగంగా షూట్ చేసిన ఈ ఫొటోలో ఆయన చేతిలో ఆయుధంతో కనిపించడం మూవీ కాన్సెప్ట్, ఆయన క్యారెక్టరైజేషన్‌పై క్యూరియాసిటీని పెంచుతోంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను ప్రకటించనున్నారు. మరోవైపు కమల్ హాసన్ నిర్మాతగా రజినీకాంత్‌తో ‘ధర్మన్’ చిత్రాన్ని రూపొందిస్తుండగా దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రం విడుదల కానుంది.
