జులై 3 నుంచి అమర్‌ నాథ్ యాత్ర...ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్లు షురూ : జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

జులై 3 నుంచి అమర్‌ నాథ్ యాత్ర...ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్లు షురూ : జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

జమ్మూ: దక్షిణ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహాలయ సందర్శనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుండగా, ఆగస్టు 28 వరకు (57 రోజులు) యాత్ర కొనసాగనుందని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం ప్రకటనలో తెలిపారు. యాత్రకు రావాలనుకునే భక్తులు ఈ నెల 15వ తేదీ నుంచి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలన్నారు. 13 నుంచి 70 ఏండ్ల లోపు వారు మాత్రమే యాత్రకు అర్హులని తెలిపారు. 

దేశవ్యాప్తంగా ఉన్న 556 బ్యాంకు శాఖల (ఎస్​బీఐ, పీఎన్​బీ, ఐసీఐసీఐ, యాక్సెస్, ఎస్​బ్యాంక్​) ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చని, ష్రైన్ బోర్డ్ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. భక్తుల సౌకర్యాన్ని బట్టి రెండు మార్గాల్లో గుహాలయానికి చేరుకోవచ్చు. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్ పహల్గామ్ రూట్,   గందర్‌బల్ జిల్లాలోని నిటార్​గా ఉండే 14 కిలోమీటర్ల  బల్తాల్ రూట్​లలో వెళ్లవచ్చు.