ఢిల్లీలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

ఢిల్లీలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ శశాంక్ గోయల్, ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో భవన్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

తెలంగాణ అస్తిత్వం కోసమే పోరాటం:  బీఆర్ఎస్ ఎంపీలు

తెలంగాణ అస్తిత్వం, సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం పోరాడారని బీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.