
హైదరాబాద్, వెలుగు: ఈ–కామర్స్కంపెనీ అమెజాన్ వచ్చే నెల1-–7 మధ్య ఫ్రెష్ సూపర్ వాల్యూ డేస్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా కిరాణా, నిత్యావసరాలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, స్నాక్స్, డ్రింక్స్, దైనందిన ఆహారాలపై 45శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు ప్రకటించింది.
తమ మొదటి నాలుగు ఆర్డర్లు పై కొత్త కస్టమర్స్ రూ.400 క్యాష్ బాక్, ప్రైమ్ రిపీట్ కస్టమర్స్ రూ.200 వరకు క్యాష్ బాక్ పొందవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ పై 10శాతం వరకు తక్షణ డిస్కౌంట్ ఇస్తారు. ఇతర ప్రముఖ క్రెడిట్, డెబిట్ కార్డ్స్పైనా ఆఫర్లు ఉంటాయి. కస్టమర్లు తాము కోరుకున్న డెలివర్ స్లాట్‌లను ఎంచుకోవచ్చని అమెజాన్ తెలిపింది.