భారత్‎లో అమెజాన్ భారీ పెట్టుబడి.. అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ ప్రకటన

భారత్‎లో అమెజాన్ భారీ పెట్టుబడి.. అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ ప్రకటన

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ–కామర్స్​ప్లాట్​ఫారమ్​అమెజాన్​భారత్‎లో 13 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.09 లక్షల కోట్ల) అదనపు పెట్టుబడి పెట్టనుంది. కంపెనీ సీఈఓ ఆండీ జస్సీ ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో గురువారం సమావేశమైన అనంతరం మాట్లాడుతూ.. భారత్‌లో​ 2026 నుంచి 2030 మధ్య మొత్తం 48 బిలియన్ డాలర్లు (రూ. 4.03 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు గతంలోనే ప్రణాళిక సిద్ధం చేశామని.. ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. 

ఈ పెట్టుబడితో ఏఐ, క్లౌడ్ సామర్థ్యాలు పెరుగుతాయి. ముంబై, హైదరాబాద్ నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యం విస్తరిస్తుంది. స్టార్టప్‌‌‌‌‌‌లు, ప్రభుత్వ సంస్థలకు అధునాతన ఏఐ చిప్‌‌‌‌లు అందుబాటులోకి వస్తాయి. 2030 నాటికి 38 లక్షల ఉద్యోగాలు,  రూ. 6.72 లక్ష కోట్ల ఈ–కామర్స్ ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు ఏఐ ప్రయోజనాలు కల్పిస్తారు. దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అమెజాన్ కట్టుబడి ఉందని ఆండీ ప్రకటించారు.