చిరు వ్యాపారులకు అమెజాన్ ఫెస్టివల్ ఆఫర్

చిరు వ్యాపారులకు అమెజాన్ ఫెస్టివల్ ఆఫర్
  • తెలంగాణ నుంచి 31వేలు, ఏపీ నుంచి 5100 మంది విక్రేతలకు అవకాశం

హైదరాబాద్: చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలకు అమెజాన్  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రోత్సాహాన్ని ప్రకటించింది. ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం అవుతుండగా, ప్రైమ్ సభ్యులు ముందస్తుగా యాక్సెస్ పొందేందుకు అవకాశం కల్పించింది. దేశ వ్యాప్తంగా 450 నగరాల్లో  75,000 స్థానిక షాప్స్ తమ ప్రత్యేకమైన ఉత్పత్తుల ఎంపికను అందిస్తున్నాయి.
 ఈ పండుగల సీజన్‌లో తెలంగాణ నుంచి 31వేల మంది అలాగే ఆంధ్రప్రదేశ్‌ నుంచి  5,100 మంది విక్రేతలు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు వేచి చూస్తున్నారు. ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా స్థానిక దుకాణాల నుంచి ప్రత్యేకమైన ఉత్పత్తులతో సహా 8.5 లక్షలకుపైగా విక్రేతల ఉత్పత్తులను అమెజాన్.ఇన్‌ ద్వారా కోట్లాది ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతోంది. 
గ్రాసరీతోపాటు వెయ్యి రకాల కొత్త ఉత్పత్తులు
కిరాణా, ఫ్యాషన్, బ్యూటీ, స్మార్ట్ ఫోన్లు, పెద్ద ఉపకరణాలు. టీవీలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ తదితరాలతో పాటు 1,000కిపైగా కొత్త ఉత్పత్తుల విడుదల చేస్తూ.. అద్భుతమైన ఆఫర్‌లు అందుబాటులో ఉంచుతున్నట్లు అమెజాన్ ప్రకటించింది. షాపింగ్ సందర్భంగా ఇష్టమైన భాషలో షాపింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ మరియు కొత్తగా అందుబాటులోకి తీసుకు వచ్చిన బెంగాలీ మరియు మరాఠీ భాషల్లో షాపింగ్ చేయవచ్చు. అలాగే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, గద్వాల్, మహబూబ్‌నగర్, విశాఖపట్నం మరియు తిరుపతితో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన టాప్ ఇండియన్ మరియు గ్లోబల్ బ్రాండ్లను ప్రదర్శిస్తుంది. ప్రైమ్ సభ్యులు ప్రారంభ యాక్సెస్‌ను ఆస్వాదించమంటూ ఆమెజాన్ ఆఫర్ ఇచ్చింది.