అమెజాన్, ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాక్స్ పారేస్తున్నారా?.. జాగ్రత్త! మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాక్స్ పారేస్తున్నారా?.. జాగ్రత్త! మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు

 ఈరోజుల్లో ఆన్ లైన్ షాపింగ్ కామన్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దేశంలోనే ఎక్కువగా ఉపయోగించే ఈ కామర్స్ ప్లాట్ఫాంలు. ఈ ఆన్ లైన్ షాపింగ్ పోర్ట ల్ ద్వారా వస్తువులను ఆర్డర్ చేస్తుంటాం.వస్తువును ఓ బాక్సుపై మన పూర్తి వివరాలు రాసిన పేపర్ అంటించి వస్తువులను డెలివరీ చేస్తుంటారు. అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా అందుకున్న పార్శిల్ బాక్సులతో కూడా మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు  సైబర్ నేరగాళ్లు. డెలివరీ బాక్సుతో స్కామా..? ఆశ్చర్యపోకండి.. స్కామర్ల కొత్తరకం మోసం ఇది.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా .. మీ ఖాతాలు ఖాళీ కావొచ్చు.. 

అమెజాన్, ఫ్లిప్ కార్డు ద్వారా మనం ఆన్ లైన్ బుక్ చేస్తే..వచ్చిన పార్శిల్(వస్తువులు ఉంచిన బాక్సు) తో మోసాలకు పాల్పడుతున్నా సైబర్ నేరగాళ్లు.. ఏదైనా అమెజాన్ లేదా ఫ్లిప్ కార్టఉ డెలీవరీ బాక్సును గమనించండి. దానిపై ఓ లేబుల్ ఉంటుంది. ఆ కాగితంపై కస్టమర్ కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ఇది కేవలం బాక్సు మాత్రమే కాదు..స్కామర్లకు అది డేటా హబ్.

మన అడ్రస్ తో పాటు మనకు సంబంధించిన చాలా డేటా బాక్స్ లో ఉంటుంది. దీంతో స్కామర్లు మోసం చేయడానికి ఈ డేటాను వాడతారు. దీంతో మన ఖాతా ఖాలీ అయ్యే అ వకాశం ఉంటుంది. 

►ALSO READ | 169 శాతం పెరిగిన స్ట్రింగ్ మెటావర్స్ ఆదాయం

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా ఏదైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు డెలివరీ చేస్తారు కదా..వస్తువును తీసుకున్న తర్వాత ఆ బాక్సును మనం చెత్తలో పడేస్తాం. ఇక్కడే స్కామర్లకు దొరికిపోతారు. 

బాక్సుపై ఉన్న డేటా సేకరించిన స్కామర్లు.. తొలుత ఫీడ్ బ్యాక్ చెప్పమంటూ ఫోన్ కాల్ చేస్తారు. మీ తదుపరి ఆర్డర్పై10శాతం అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ పొందేందుకు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని ఓ లింక్ ను మీకు పంపిస్తారు. ఆ లింక్ గనక మనం క్లిక్ చేసినట్లయితే మోసపోయినట్లే.. ఖాతా ఖాలీ అయినట్లే. ఆ లింకులో ఉన్న మాల్వేర్.. మీ డివైజ్ లోకి ప్రవేశించిని వివరాలతో సహా మీ సెన్సిటివ్ సమాచారాన్ని దొంగిలిస్తారు. అంతే మీరు మోసం పోయినట్లే.  

ఎలా రక్షించుకోవాలి?

బాక్సుపై ఉన్న సమాచారంతో స్కామర్లు ఖాతాలు ఖాళీ చేస్తున్న డెలివరీ బాక్సులను వాటిపై ఉన్న వివరాలను తుడిచెయ్యాలి.బాక్సు నుంచి మీ డేటాను దాచేందుకు ఐడెంటిటీ రోలర్ స్టాంప్ వంటి ఎక్విప్ మెంట్ల ఉపయోగించాలి. 

రెండోది డిస్కౌంట్లకోసం తెలియని వ్యక్తులు షేర్ చేసిన లింక్ లపై క్లిక్ చేయకుండా  జాగ్రత్తపడాలి. అప్పుడే మీ డేటా షేర్ కాకుండా మీ బ్యాంకు ఖాతాలను కాపాడు కోవచ్చు.