
హైదరాబాద్, వెలుగు: మెటావర్స్ టెక్నాలజీ సంస్థ స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్ 2025 ఆర్థిక సంవత్సరం ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఆదాయం వార్షికంగా 169.40శాతం పెరిగి రూ.407.36 కోట్లకు చేరింది. కంపెనీ రూ.35.25 కోట్ల నికర లాభాన్ని (నికరలాభం) ఆర్జించింది. ఈ సందర్భంగా స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్ ఎండీ మాట్లాడుతూ ఇక నుంచి తాము నాన్ -ఫంగబుల్ టోకెన్ల వంటి డిజిటల్ ఆస్తుల అభివృద్ధి వినియోగానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. -----------