అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా ...కార్పొరేట్ కానుకలపై 75 శాతం వరకు డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా ...కార్పొరేట్ కానుకలపై 75 శాతం వరకు డిస్కౌంట్

హైదరాబాద్​, వెలుగు: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా వ్యాపార సంస్థల కోసం అమెజాన్ బిజినెస్ ప్రత్యేక కార్పొరేట్ గిఫ్ట్స్​పై ఆఫర్లు ప్రకటించింది. ఉద్యోగులు, క్లయింట్లు, వ్యాపార భాగస్వాములకు బహుమతులు ఇచ్చేందుకు 10 వేలకు పైగా ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది.

వీటిపై ఎమ్మార్పీ కంటే 75 శాతం వరకు తగ్గింపుతో పాటు బల్క్ కొనుగోళ్లపై అదనంగా 14 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కొన్ని విభాగాల్లో రూ.9,999 వరకు అదనపు క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై అపరిమిత 5 శాతం క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్ ఇస్తున్నారు.