అమెజాన్ ఇండియా లో ట్రైన్ టికెట్లు

అమెజాన్ ఇండియా లో ట్రైన్ టికెట్లు

రైలు టికెట్లను బుక్‌ చేసుకొనే సౌకర్యాన్ని అమెజాన్‌ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం అమెజాన్‌ ఇండియా.. భారత్‌ రైల్వేకు చెందిన IRCTCలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఫస్ట్ టైం టికెట్ల బుకింగ్‌పై అమెజాన్‌ వినియోగదార్లుకు 10 శాతం క్యాష్‌ డిస్కౌంట్‌ కూడా లభించనుంది. ఈ డిస్కౌంట్‌ అత్యధికగా రూ.100 వరకు ఉంటుంది. ఇక ప్రైమ్‌ సభ్యులకు 12శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఇది అత్యధికంగా రూ.120 వరకు ఉంటుంది. ఈ ఆఫర్‌ పరిమిత కాలం మాత్రమే వర్తిస్తుందని సంస్థ తెలిపింది. కొంతకాలం పాటు అమెజాన్‌.ఇన్‌ కూడా పేమెంట్‌ గేట్‌వే ఫీజ్‌ను రద్దు చేసింది. ఈ కొత్త సేవలతో అమెజాన్‌ పేతో విమాన, బస్సు టికెట్లతోపాటు రైలు సీట్లు కూడా బుకింగ్‌ చేసుకొనే అవకాశం లభించింది.

అమెజాన్‌ యాప్‌లో వినియోగదారులు రైళ్లలో సీట్ల వివరాలను చెక్‌ చేసుకోవచ్చు. PNR స్టేటస్‌ కూడా తెలుసుకోవచ్చు. అమెజాన్‌ నుంచి బుక్‌ చేసుకొన్న టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడం.. రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ సరికొత్త సేవలు అమెజాన్‌ ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ యాప్‌లలో లభించనున్నాయి. దీంతోపాటు 24×7 హెల్ప్‌లైన్‌ అమెజాన్‌ ఏర్పాటు చేసింది.