అమెజాన్‌లో 20 వేల మందికి కరోనా

అమెజాన్‌లో 20 వేల మందికి కరోనా

అమెరికాలోని తమ సంస్థకు చెందిన దాదాపు 20 వేల మంది కరోనా భారినపడినట్లు ఆన్‌లైన్ దిగ్గజ కంపెనీ అమెజాన్ తెలిపింది. కరోనా ప్రారంభ దశ మార్చి నుంచి ఇప్పటివరకు తమ సంస్థలో పనిచేస్తున్న 19,800 మంది ఉద్యోగులకు కరోనా సోకిందని అమెజాన్ ప్రకటించింది. మార్చి 1 నుంచి సెప్టెంబర్ 19 వరకు అమెరికాలోని ఫుడ్ స్టోర్లలో పనిచేసే 1.37 మిలియన్ల ఉద్యోగుల డేటాను పరిశీలిస్తే వారిలో ఊహించిన దానికంటే తక్కువగానే ఇన్ఫెక్షన్ సోకిందని అమెజాన్ తెలిపింది.

లాజిస్టిక్స్ కేంద్రాల్లోని కొంతమంది ఉద్యోగులు వైరస్ నుంచి రక్షించుకోవడానికి సంస్థ యొక్క భద్రతలను విమర్శించారని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా.. కరోనా భారినపడిన వాళ్లు కూడా తమ ఆరోగ్య విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేదని సంస్ధ తెలపింది. ఈ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి అమెజాన్ బిల్డింగ్స్‌లో ఎవరికైనా కరోనా సోకితే వెంటనే మిగతా ఉద్యోగులకు సమాచారమిచ్చి అప్రమత్తం చేశామని అమెజాన్ తెలిపింది. సంస్థకు చెందిన 650 సైట్లలో రోజుకు 50 వేల కరోనా పరీక్షలు చేసినట్లు సీటెల్ ఆధారిత సంస్థ తెలిపింది. అమెజాన్ మరియు హోల్ ఫుడ్స్ కార్మికులలో వైరస్ సంక్రమణ రేటు.. సాధారణ యూఎస్ జనాభాతో సమానంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

For More News..

డొనాల్డ్ ట్రంప్‌కి కరోనా పాజిటివ్

తెలంగాణలో మరో 2,009 కరోనా కేసులు

కరోనా టైంలో కోటి చీరలు నేసిన నేతన్నలు