అమెజాన్‌‌ ఎగుమతులు రూ.1.07 లక్షల కోట్లకు!

అమెజాన్‌‌ ఎగుమతులు రూ.1.07 లక్షల కోట్లకు!

న్యూఢిల్లీ: ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్  ఈ ఏడాది చివరినాటికి  13 బిలియన్ డాలర్ల (రూ.1.07 లక్షల కోట్ల)  విలువైన ప్రొడక్ట్‌‌లను ఎగుమతి చేయాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది.  కిందటేడాది చేసిన  ఎగుమతులు 8 బిలియన్ డాలర్ల (రూ.66 వేల కోట్ల) తో పోలిస్తే ఇది 62.5 శాతం ఎక్కువ. 2025 నాటికి ఇండియా నుంచి వివిధ దేశాలకు 20 బిలియన్ డాలర్ల (రూ.1.66 లక్షల కోట్ల) విలువైన ప్రొడక్ట్‌‌లను ఎగుమతి చేయాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది.

వాల్‌‌మార్ట్‌‌కు చెందిన ఫ్లిప్‌‌కార్ట్ కూడా 2027 నాటికి ఇండియా నుంచి ఏడాదికి 10 బిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్ట్‌‌లను ఎగుమతి చేయాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది.  కంపెనీ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్‌‌ను 2015 లో స్టార్ట్ చేసింది. గత తొమ్మిదేళ్లలో 1,50,‌‌‌‌000 ఎగుమతిదారులను  సొంతం చేసుకుంది. వీరు 40 కోట్లకు పైగా మేడిన్ ఇండియా ప్రొడక్ట్‌‌లను అమెజాన్‌ ద్వారా వివిధ దేశాలకు ఎగుమతి చేశారు.