న్యూఢిల్లీ: ఇండియాలో క్విక్ కామర్స్ బిజినెస్ ‘అమెజాన్ నౌ’ ను 300 కంటే ఎక్కువ సిటీలకు విస్తరిస్తామని ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ గ్లోబల్ సీఈఓ యాండీ జెస్సీ ప్రకటించారు. అత్యంత వేగంగా డెలివరీ చేసే అతిపెద్ద నెట్‌వర్క్‌ను నిర్మించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
యాండీ జెస్సీ తన ఇండియా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ముంబైలోని ఒక ‘అమెజాన్ నౌ’ మైక్రో- ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని (డార్క్ స్టోర్) సందర్శించారు. బిజినెస్‌ను విస్తరించడానికి, ఏఐ, డిజిటలైజేషన్, కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి 2030 నాటికి అదనంగా 35 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.36లక్షల కోట్లు) పెట్టుబడి పెడతామని అమెజాన్ ఇప్పటికే ప్రకటించింది.
