రూ.70‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 కోట్లు సేకరించే పనిలో అంబానీ ఈవీ కంపెనీ

రూ.70‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 కోట్లు సేకరించే పనిలో అంబానీ ఈవీ కంపెనీ

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఆల్టీగ్రీన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.700 కోట్లు సేకరించాలని ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేస్తోంది.  ఎలక్ట్రిక్ కార్గో వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేసే ఈ కంపెనీ తన ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచాలని, కొత్త మోడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకురావాలని చూస్తోంది. 350 మిలియన్ డాలర్ల దగ్గర ఆల్టీగ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్స్ సేకరించనుందని సంబంధిత  వ్యక్తులు పేర్కొన్నారు.  

ఫండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేకరణపై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని చెప్పారు. ఫండింగ్ సేకరణలో ఉన్నామని, జులై లోపు ముగిస్తామని కంపెనీ ఆల్టీగ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఈఓ అమితాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సారన్  ఇప్పటికే నిర్దారించారు. 2013 లో ఏర్పాటైన ఈ కంపెనీ, కార్గో త్రీవీలర్లను డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , మాన్యుఫాక్చరింగ్ చేస్తోంది.  యాన్యువల్ కెపాసిటీ 55 వేల వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కంపెనీ సిరీస్ ఏ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా రూ.300 కోట్లను సేకరించింది.  అంబానీకి చెందిన  రిలయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూ ఎనర్జీ  , ఎక్సోనెన్షియా క్యాపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టనర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మూమెంటం వెంచర్ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాక్యురెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్  ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాయి.