మళ్ళీ వైసీపీలోకి అంబటి రాయుడు - సిద్ధం అంటూ ట్వీట్...

మళ్ళీ వైసీపీలోకి అంబటి రాయుడు - సిద్ధం అంటూ ట్వీట్...

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గతంలో వైసీపీలో చేరిన కొంతకాలానికే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వైసీపీకి దూరమైన రాయుడు ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయనకు మద్దతు తెలిపారు కానీ, తర్వాత ఎక్కడా కనిపించలేదు. తాజాగా అంబటి రాయుడు మళ్ళీ వైసీపీలో చేరే సంకేతాలు వస్తున్నాయి. సిద్ధం అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేయటమే ఇందుకు కారణం. అంబటి రాయుడు ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాయుడు తిరిగి వైసీపీలో చేరనున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

 

అంబటి రాయుడు గుంటూరు నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేయనున్నారని ప్రచారం జరిగింది. రాయుడికి ఎంపీ టికెట్ ఇవ్వని కారణంగానే వైసీపీకి దూరమయ్యాడని కూడా వార్తలొచ్చాయి. కానీ, దుబాయ్ లో నిర్వహించిన ఇన్టర్నేషనల్ T 20లీగ్ లో ఎమ్ఐ ఎమిరేట్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, లీగ్ రూల్స్ ప్రకారం రాజకీయలలో యాక్టివ్ గా ఉండకూడదన్న నియమానికి లోబడి ఈ నిర్ణయం తీసుకున్నానని క్లారిటీ ఇచ్చాడు.మొత్తానికి జనసేనలో చేరతారని ఊహాగానాలు వచ్చిన తర్వాత సిద్ధం అంటూ అంబటి రాయుడు ట్వీట్ చేయటం ఆసక్తికరంగా మారింది.