హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 64 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అర్జీలను స్వీకరించారు. గూగుల్ మ్యాప్స్, రెవెన్యూ, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఆధారంగా వివాదాస్పద స్థలాలను పరిశీలించారు. పలుచోట్ల నాలాలు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయంటూ ఫిర్యాదులు అందాయి.
కలెక్టరేట్, జీహెచ్ఎంసీలో...
హైదరాబాద్ కలెక్టరేట్ ప్రజావాణిలో 249 ఫిర్యాదులు వచ్చాయి. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం- 23, ఇందిరమ్మ ఇండ్ల కోసం 139, పెన్షన్స్ 21, రెవెన్యూ 29, ఇతర శాఖలవి 37 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ హరిచందన దాసరి అర్జీలు స్వీకరించారు. జీహెచ్ఎంసీలో నిర్వహించిన ప్రజావాణికి 203 ఫిర్యాదులు వచ్చాయి. హెడ్ ఆఫీసులో 75, కూకట్ పల్లి జోన్ లో 52, సికింద్రాబాద్ జోన్ లో 22 , శేరిలింగంపల్లి జోన్ లో 10, ఎల్బీనగర్ జోన్ లో 31, చార్మినార్ జోన్ లో 10, ఖైరతాబాద్ జోన్ లో 3 ఫిర్యాదులు వచ్చాయి.
రంగారెడ్డి కలెక్టరేట్లో..
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 40 ఫిర్యాదులు వచ్చాయి. అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత పాల్గొన్నారు.
