V6 News

నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఆమ్ చూర్ వచ్చేసింది

నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఆమ్ చూర్ వచ్చేసింది

నిజామాబాద్ మార్కెట్​యార్డుకు ‘ఆమ్ చూర్’ రాక మొదలైంది. ఇక్కడ పసుపు తర్వాత ఆమ్ చూర్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్,​ మెదక్​జిల్లాల రైతులు ఇక్కడికి ఆమ్ చూర్ తీసుకువస్తారు. 

అయితే అకాల వర్షాల కారణంగా రంగు మారిన ఆమ్ చూర్ కు ప్రస్తుతం తక్కువ ధరే ఉంది. కనీస ధర రూ.18 వేలు కాగా గరిష్టంగా రూ.21,500 పలుకుతోంది. మెదటి రోజు 265 బ్యాగులు వచ్చాయని మార్కెట్ కమిటీ తెలిపింది. 

– వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్