రష్యా విమానాలను అమెరికా తరిమికొట్టింది!

రష్యా విమానాలను అమెరికా తరిమికొట్టింది!

వాషింగ్టన్: అమెరికా భూభాగమైన అలస్కాకు దగ్గరగా వచ్చిన రష్యన్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ జెట్స్​ను యూఎస్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్​ తరిమికొట్టింది. సోమవారం ఈ ఘటన జరిగినట్లు వివరించింది. రష్యన్ ఫైటర్ జెట్స్ అమెరికా, కెనడా ఎయిర్​స్పేస్​లోకి ఎంటర్​ కాలేదని, ఎలాంటి ప్రమాదం కలిగించలేదని నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ తెలిపింది. రష్యాకు చెందిన టీయూ- 95 బేర్‌‌ హెచ్‌‌ మిసైల్​ క్యారియర్లు, సుఖోయ్‌‌ 35 ఫైటర్ జెట్‌‌లు అలస్కా ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ దగ్గరికి వచ్చాయని వివరించింది. ఇది గుర్తించి వెంటనే 2 ఎఫ్16 ఫైటర్​ జెట్స్​ను పంపించి వాటిని అడ్డగించి దారి మళ్లించామని తెలిపింది. రష్యా కదలికలపై నిఘా ఉంచడంతో దీనిని ముందే గుర్తించామని నార్త్ అమెరికన్​ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ ప్రకటించింది.  

ఎలాంటి ప్రమాదం ఉండదు : అమెరికా

అలస్కా, రష్యా మధ్య ఉన్న బేరింగ్​ సముద్రంతో పాటు అంతర్జాతీయ జలాలపై రష్యా విమానాలు తరుచూ ప్రయాణిస్తూ ఉంటాయి. కొన్ని సార్లు ఎస్కార్ట్​గా అలస్కా వరకు వస్తుంటాయి. ఈసారి ఎలాంటి సమాచారం లేకపోవడంతోనే రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్​ను అమెరికన్​ జెట్స్ దారి మళ్లించాయి. ప్రతీ రోజూ ఈ ప్రాంతంలో రష్యా విమానాల రాకపోకలు సాగుతూ ఉంటాయని అమెరికా ఎయిర్​ఫోర్స్​ తెలిపింది. వాటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండబోదని చెప్పింది. లాంగ్​ రేంజ్​ఏవియేషన్​ పైలట్స్​ రెగ్యులర్​గా ఆర్కిటిక్, నార్త్​ అట్లాంటిక్, నల్ల సముద్రం, బాల్టిక్​ సముద్రం, పసిఫిక్​ మహా సముద్రం న్యూట్రల్​ వాటర్స్​పై విమానాలు నడుపుతూ ఉంటారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, చైనా స్పై బెలూన్ అమెరికా ఎయిర్​స్పేస్​లోకి ప్రవేశించిన తర్వాత యూఎస్​ ఆర్మీ నిఘా పెంచింది.