కోవాగ్జిన్ వేసుకున్న వారికి అమెరికా గ్రీన్ సిగ్నల్

కోవాగ్జిన్ వేసుకున్న వారికి అమెరికా గ్రీన్ సిగ్నల్

వాషింగ్టన్: విదేశీయుల రాకపై ఆంక్షలు విధించిన అమెరికా వ్యాక్సిన్లు వేసుకున్న వారిని మాత్రమే షరతులతో అనుమతులిస్తోంది. తాజాగా తమ ప్రయోగాల్లో నాణ్యమైనదేనని నిర్ధారణ కావడంతో కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా అనుమతినివ్వాలని నిర్ణయించింది. మన దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. పలు క్లినికల్ ట్రయల్స్ ద్వారా స్వయంగా నిర్ధారించుకున్న తర్వాతే కోవాగ్జిన్ కు అమెరికా అనుమతిచ్చినట్లు సమాచారం. 
భారత్ సహా పలు ఆసియా దేశాల విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటున్న నేపధ్యంలో అమెరికా నిర్ణయం భారతీయులకు శుభవార్తే. కోవాగ్జిన్ ను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ తమ ఉత్పత్తిలో 75 శాతం భారత్ లో ఉపయోగానికే కేటాయిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్లో అందుబాటులో లేకపోతే ప్రైవేటుగా కేవలం తక్కువ ఖర్చుకే కోవాగ్జిన్ వేయించుకునే అవకాశం ఉంది.