హైదరాబాద్‌‌ నుంచి .. అమెరికాకు ఫ్లైట్‌‌ నడపండి

హైదరాబాద్‌‌ నుంచి .. అమెరికాకు ఫ్లైట్‌‌ నడపండి
  • కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డికి ఎన్‌‌ఆర్‌‌‌‌ఐల విజ్ఞప్తి
  • టీడీఎఫ్ నేతల భేటీ..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డితో అమెరికాలో ఉన్న ప్రవాస తెలంగాణ వాదులు, తెలంగాణ డెవలప్‌‌మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్)నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రీటింగ్స్ తెలిపారు. టీడీఎఫ్ మాజీ అధ్యక్షులు మురళి చింతలపాని, లక్ష్మణ్ అనుగు, ఇతర కార్యవర్గసభ్యులు భేటీ అయ్యారు. రాష్ట్ర సాధనలో ప్రవాస తెలంగాణ వాసులు, ముఖ్యంగా టీడీఎఫ్ పోషించిన పాత్రను ఈ సందర్భంగా కిషన్‌‌రెడ్డి గుర్తుచేసి, వారిని అభినందించారు.

కిషన్​రెడ్డికి ఐఎన్‌‌సీ లీడర్ షిప్ అవార్డు

కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఇన్‌‌క్రెడిబుల్ ఐఎన్‌‌సీ లీడర్‌‌షిప్ అవార్డు’దక్కింది. ఇండియా, -అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్- టు -పీపుల్ ఎక్స్‌‌చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే.. ‘యూఎస్ ఇండియా ఎస్‌‌ఎంఈ కౌన్సిల్’సంస్థ ఈ అవార్డును కేంద్ర మంత్రికి అందజేసింది. ఇండియా సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు పర్యాటకాభివృద్ధికి కిషన్ రెడ్డి చేసిన కృషికి గాను అమెరికాలోని మేరీలాండ్ స్టేట్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును కేంద్ర మంత్రికి శనివారం రాత్రి అందజేశారు. ‘‘యూఎస్ ఇండియా ఎస్‌‌ఎంఈ కౌన్సిల్’సంస్థ నుంచి లీడర్‌‌‌‌షిప్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశ చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు పర్యాటకరంగ అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది’’అని ట్విట్టర్‌‌‌‌లో ఆయన పేర్కొన్నారు.