దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత అయోధ్య రాముడికి కాటన్ వస్త్రాలు

దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత అయోధ్య రాముడికి కాటన్ వస్త్రాలు

గత రెండురోజులుగా దేశవ్యాప్తంగా పలు చోట్ల గరిష్ట ఉష్టోగ్రతలు నమోదైయ్యాయి. ఇప్పటివరకు ఈ సీజన్ లోనే అత్యధికంగా మార్చి 28న దేశ రాజధాని ఢిల్లీలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఈనేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య రామమందిరంలో శ్రీరాముడికి మార్చి 30 నుంచి కాటన్ వస్త్రాలే ధరిస్తారని దేవాలయ ట్రస్ట్ అధికారిక ఎక్స్ ఖాతాలో తెలిపారు. మల్మాల్ కాటన్‌తో తయారు చేసి సహజ నీలిమందు రంగులు అద్దిన వస్త్రాలు ప్రత్యేకంగా తయారు చేయించామని తీర్థ క్షేత్రం Xలో ఒక పోస్ట్ విడుదల చేసింది. గొట్టా పూలతో అలంకరించిన బాల రాముని ఫొటోను పోస్ట్ చేసింది. 

శనివారం అప్పటి కంటే ఎక్కువ ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య ప్రదేశ్, మహారాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ లోని రాయల సీమ ప్రాంతాల్లో వేడి విపరీతంగా పెరుగుతుంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5డిగ్రీలు పెరిగాయని IMD పేర్కొంది. ప్రజలు ఎండ బారిన పడకుండా పగటి పూట ఇంట్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: ఆ గది లేకపోతే అప్పులపాలు అవుతారా.. దేవుడి గదికి కచ్చితంగా తలుపు ఉండాలా..?