Vastu Tips : ఆ గది లేకపోతే అప్పులపాలు అవుతారా.. దేవుడి గదికి కచ్చితంగా తలుపు ఉండాలా..?

Vastu Tips : ఆ గది లేకపోతే అప్పులపాలు అవుతారా.. దేవుడి గదికి కచ్చితంగా తలుపు ఉండాలా..?

మేము వచ్చే నెలలో ఇల్లు కట్టడం మొదలు పెట్టాలి అనుకుంటున్నాం. అయితే దేవుడికి ప్రత్యేకంగా గది లేకపోతే అప్పులపాలవుతారని చాలామంది అంటున్నారు. అందుకే పూజ గది కూడా ప్రత్యేకంగా కట్టాలనుకుంటున్నాం. కచ్చితంగా ఈశాన్యంలోనే కట్టాలని కూడా కొంతమంది సూచిస్తున్నారు. అసలు దేవుడి గది ఎలా, ఎక్కడ ఉంటే మంచిది? అలాగే చనిపోయిన మా పెద్దల ఫొటోలను ఆ గదిలో పెట్టుకోవచ్చా?

పూజ గది ఎక్కడున్నా దానికి తలుపు ఉండటం అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. అది కుదరనప్పుడు కనీసం పరదా అయినా అడ్డుగా ఉండాలి. మీ కొత్త ఇంట్లో పూజ గదిని ఈశాన్యంలో కొందరు పెట్టమంటున్నారని చెప్తున్నారు. కానీ దాన్ని నేను సమర్పించను. ఎందుకంటే ఆ మూలు బరువు ఉండకూడదు. అక్కడ ఏమీ లేనప్పుడే దేవుడు ఉన్నట్లు లెక్క.

ప్రత్యేకంగా అక్కడ దేవుడి పటాలను పెట్టనక్కర్లేదు. అసలు ఈశాన్యం మూల దీపారాధనలు చేయకూడదు. అలాగే, పూజ గదిని నైరుతి మూలన కాకుండా, పడమర గోడకు పెట్టి, దేవుడి ముఖం తూర్పుకు ఉండేలా చూసుకోవాలి. లేదా హాల్లో పెట్టుకునేట్లయితే... దేవుడి ముఖం పడమర చూడొచ్చు. చనిపోయిన పెద్దల ఫొటోలను దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. వాళ్లకు పూజ కూడా చేసుకోవచ్చు.