
ఏపీ : రాజమండ్రిలో జరిగిన శక్తికేంద్ర ప్రముఖ్ సమ్మేళన్ లో పాల్గొన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. పుల్వామా ఎటాక్ జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ డాక్యుమెంటరీ షూటింగ్ లో పాల్గొన్నారన్న కాంగ్రెస్ విమర్శలకు అమిత్ షా వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ ఆధారాలు లేని ఆరోపణలు చేసిందన్నారు. దేశానికి రోజులో 18 గంటల పాటు కష్టపడే ప్రధానమంత్రి ఉన్నారని చెప్పారు.
కశ్మీర్ ఇపుడు ఈ పరిస్థితుల్లో ఉందంటే అందుకు ప్రధాన కారణం జవహర్ లాల్ నెహ్రూ అని అన్నారు అమిత్ షా. దేశ తొలి ప్రధానమంత్రి నెహ్రూ కాకుండా… సర్దార్ వల్లభాయ్ పటేల్ అయ్యుంటే దేశ విభజన సమస్యలు ఉండేవి కావనీ.. కశ్మీర్ లో ఉగ్రవాద సమస్య కనిపించేది కాదని అన్నారు.