
దేశ ప్రతిష్టలు కాపాడటంలో పోలీస్ వ్యవస్థ రోల్ చాలా కీలకమని, ఐపిఎస్ లు దేశ అత్యున్నతీ కోసం పాటుపడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన 75వ బ్యాచ్ IPS ల పాసింగ్ అవుట్ పరేడ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..దేశానికి సేవ అందించడంలో ఐపిఎస్ లు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని... పీడిత ప్రజల అభ్యున్నతీ వారి భద్రత కోసం ఐపిఎస్ లు నిబద్దతతో కృషి చేయాలని అన్నారు. 75వ బ్యాచ్ ఐపిఎస్ శిక్షణలో 33మంది మహిళా ఐపిఎస్ లు ఉండడం గర్వకారణం, సంతోషంగా ఉందన్నారు. సైబర్ నేరాల అదుపు, నేరగాళ్లకు చెక్ పెట్టడంలోనూ టెక్నాలజీ పై ఐపిఎస్ లు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.
భవిష్యత్ లో ఎదురయ్యే ఎన్నో సవాళ్ళను ఐపిఎస్ లు అలవోకగా ఎదురుకోవాలని చెప్పారు. అర్గనేనింగ్ క్రైమ్, సైబర్ క్రైమ్, క్రిప్తో కరెన్సీ, హవాలా, నకిలీ నోట్ల, నార్కోటిక్స్, ఇంటర్ స్టేట్ గ్యాంగ్, చార్జిషీట్ ఫైల్, ఫోరెన్సిక్ సైన్స్ ఇలా అన్ని అంశాలపై ఐపిఎస్ లు పట్టు సాధించాలన్నారు. న్యాయ వ్యవస్థలో వస్తున్న మార్పులు అనుగుణంగా క్రిమినల్ జస్టిస్ పై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. దేశప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలో అన్ని రంగాలో దేశం ముందుకెలుతుందని... అంతిమంగా ఐపిఎస్ లు ప్రజల భద్రత అందించడంలో మనసులు గెలవాలి అని పేర్కొన్నారు.