జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తాం : అమిత్ షా

 జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తాం : అమిత్ షా

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.  జమ్మూకాశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 11వ తేదీ సోమవారం ఆర్టికల్ 370ను రద్దును సమర్థిస్తూ దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.  దీనిపై అమిత్ షా రాజ్యసభలో మాట్లాడుతూ..  సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్నారు. 

ఆర్టికల్  370 రద్దు తర్వాత కాశ్మీర్ యువత అభివృద్ది కోరుకుంటోందని చెప్పారు.  కాశ్మీర్ విషయంలో జవహర్ లాల్ నెహ్రా పెద్ద తప్పు చేశారని అన్నారు. పీఓకే భారత్ లో భాగమేనని చెప్పారు. భారత్ పై దాడి చేసేందుకు పాకిస్థాన్ కు నెహ్రూ అవకాశం ఇచ్చారని.. రెండు రోజులు ఆగి ఉంటే పీఓకే కూడా భారత్ ఆధీనంలోకి వచ్చేదన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో గతం కంటే 70శాతం టెర్రరిజం తగ్గిపోయిందన్నారు. జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది.