కౌన్ బనేగా కరోడ్‌పతి 17వ సీజన్ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ఈ షో గ్రాండ్ గా కొనసాగుతోంది. ఇందులో భాగంగా క్రికెట్ పై ఒక ప్రశ్న కంటెస్టెంట్ కు ఎదురైంది. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు క్రికెట్ లవర్స్ అలవోకగా సమాధానం చెప్పేస్తారు. కానీ హాట్ సీట్ లో కూర్చున్న కంటెస్టెంట్ సమాధానం చెప్పడం కష్టం. ఇందులో భాగంగా ఒక క్రికెట్ లో ఏకంగా రూ. 7 కోట్ల 50 లక్షలకు క్రికెట్ కు సంబంధించిన ప్రశ్న అడగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనికి సమాధానం క్రికెట్ లవర్స్ చెప్పడం కూడా కష్టమే. ఆ ప్రశ్న ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ ఏ ఇండియన్ క్రికెటర్ క్యాచ్ పట్టుకొని రాహుల్ ద్రవిడ్ అత్యధిక క్యాచ్ ల రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఈ ప్రశ్నకు యశస్వి జైశ్వాల్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి కరుణ్ నాయర్. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 2025 తో ఇండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మూడో టెస్ట్ ఆడుతున్నప్పుడు కరుణ్ నాయర్ క్యాచ్ అందుకొని అత్యధిక క్యాచ్ లు (వికెట్ కీపర్ కాకుండా) అందుకున్న ఫీల్డర్ గా నిలిచాడు.
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టిన రూట్.. ఫీల్డర్ గా టెస్టుల్లో అత్యధిక క్యాచ్ లు పట్టిన ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్ కు ముందు ద్రవిడ్ (210)తో సమానంగా ఉన్న ఈ ఇంగ్లీష్ బ్యాటర్.. కరుణ్ నాయర్ క్యాచ్ తో 211 క్యాచ్ లతో అగ్ర స్థానంలోకి వెళ్ళాడు. జయవర్ధనే (205), స్టీవ్ స్మిత్ (200), జాక్ కల్లిస్ (200),రికీ పాంటింగ్ (196) వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో రూట్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. 37వ సెంచరీతో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు.
This was the ₹7.5 lakh question on KBC, can you guess the right answer? 🤔💭
— OneCricket (@OneCricketApp) November 9, 2025
Drop your answers in the comment.
PC: SonyLiv#KBC #TestCricket #JoeRoot #TeamIndia pic.twitter.com/tccAnaQwKK
