
ముంబై: ముంబైలోని మెరైన్ డ్రైవ్-బాంద్రా వర్లీ సీ లింక్‌ను కలిపే రోడ్ టన్నెల్‌ను బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ మెచ్చుకున్నారు. సోమవారం టన్నెల్లోంచి కారు లో వెళ్తుండగా తీసిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ‘టన్నెల్ ఒక అద్భుతం’ అని కొనియాడారు. ఈ వీడియోను కొద్ది నిమిషాల్లోనే 50 వేలమందికి పైగా చూశారు. 10.8 కిలోమీటర్ల పొడవున్న ఈ సీ లింక్ రోడ్డు మార్గ మధ్యలో టన్నెల్ ఉంది. రూ.12,721 కోట్ల అంచనా వ్యయంతో 2018లో పనులు ప్రారంభం కాగా, పూర్తయిన ఫస్ట్ ఫేజ్‌ను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మార్చి 11న ప్రారంభించారు.