అప్పట్లో రేప్ లపై అమితాబ్ సంచలన కామెంట్స్.. ఇప్పుడు వైరల్

అప్పట్లో రేప్ లపై అమితాబ్ సంచలన కామెంట్స్.. ఇప్పుడు వైరల్

దిశ హత్యాచార ఘటనతో యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ దారుణానికి పాల్పడ్డవారికి ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు జనం. సినీ సెలబ్రిటీలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. రేప్ లపై బాలీవుడ్ నటుడు బిగ్ బీ, అమితాబచ్చన్ 30 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆ మాటలు ఇప్పుడు ఆయన్ను వెన్నాడుతున్నాయి.

1990లో అమితాబ్ రేప్ ల పై మాట్లాడారు. రేప్ తప్పదనుకున్నప్పుడు వెనక్కి జరిగి పడుకుని ఎంజాయ్ చేయండంటూ అప్పట్లో వ్యాఖ్యానించినట్టు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1990లో ‘మూవీ’ అనే మేగజీన్ కవర్ పేజీ మీద వున్న అమితాబ్ చేసిన వ్యాఖ్యలతో ఉన్న ఫొటోను నెటిజెన్లు షేర్ చేస్తున్నారు.