V6 News

ఓడినా ప్రజల మధ్యనే ఉంటా : కస్తూరి నరేందర్‌

ఓడినా ప్రజల మధ్యనే ఉంటా : కస్తూరి నరేందర్‌

గండిపేట, వెలుగు: తాను ఎన్నికల్లో ఓడినప్పటికీ ప్రజల మధ్యనే ఉంటానని రాజేంద్రనగర్‌ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్ తెలిపారు. సోమవారం మణికొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తనకు 82 వేల 57 ఓట్లను వేసిన ప్రజలకు, అందుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు.

ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, నిరంతరం జనాల్లో ఉంటూ సేవ చేస్తానన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకున్నారని.. అందుకే కాంగ్రెస్​కు పట్టం కట్టారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను రాజేంద్రనగర్ సెగ్మెంట్ వాసులకు అందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు.