ధోనీపై అమూల్ ఎమోషనల్ డూడుల్.. ఫ్యాన్స్ ఫిదా

ధోనీపై అమూల్ ఎమోషనల్ డూడుల్.. ఫ్యాన్స్ ఫిదా

న్యూఢిల్లీ: ఇంటర్నేషన్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్స్‌ నుంచి తాను వైదొలుగుతున్నట్లు టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ప్రకటించాడు. దేశానికి రెండు వరల్డ్‌కప్‌లు, చాంపియన్స్ ట్రోఫీ అందించిన మాహీ.. టెస్టుల్లో మెన్‌ ఇన్‌ బ్లూను నెం.1 స్థానానికి చేర్చాడు. అత్యంత సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా నిలిచిన మిస్టర్ కూల్‌.. తన కీపింగ్‌, హిట్టింగ్ స్కిల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీకి గౌవరంగా ప్రముఖ డైరీ సంస్థ అమూల్ స్పెషల్ డూడుల్‌ రూపొందించింది. ఈ డూడుల్‌ నెటిజన్స్‌ను, ముఖ్యంగా మాహీ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ధోని రిటైర్మెంట్ సందర్భంగా టాపికల్ పేరుతో అమూల్ ఈ డూడుల్‌ను ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసింది. ఈ డూడుల్‌లో అమూల్ గర్ల్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. నంబర్ 7 జెర్సీతో బట్టర్ నిండిన బ్రెడ్‌ను తింటూ ధోని వెనక్కి తిరిగి చూస్తున్న డూడుల్ అట్రాక్టివ్‌గా ఉంది. ఓటములు ఎదురైనా ఆగని మాహీ నువ్వు బట్టర్ కెప్టెన్‌వి అంటూ డూడుల్‌లో క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ డూడుల్‌కు ముందు ధోనీ సేవలను గుర్తు చేస్తూ అమూల్‌ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ధోని కెరీర్‌‌, విజయాలను గుర్తు చేస్తూ తయారు చేసిన ఈ వీడియో ఫ్యాన్స్‌ను ఎట్రాక్ట్‌ చేస్తోంది. ధోని తర్వాతి ఇన్సింగ్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ ఈ వీడియోకు అమూల్ క్యాప్షన్ జత చేసింది.