గాల్లో ఉండగా ఊడిన విమానం టైరు

గాల్లో ఉండగా ఊడిన విమానం టైరు

శాన్ ఫ్రన్సిస్కో : అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ అయిన యునైటైట్ ఎయిర్ లైన్స్ లోని ఓ విమానానికి పెను ప్రమాదం తప్పంది. విమానం టేకాఫ్ అయిన తరువాత కొద్దిసేపటికే వెనుక వైపు ఉన్న టైర్లలో ఒక టైరు ఊడిపోయింది. వెంటనే అప్రమత్తమయిన అధికారులు సేఫ్ గా ల్యాండ్ చేసారు.

వివరాల్లోకి వెళితే యునైటెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 777200 విమానం గురువారం ఉదయం శాన్ ఫ్రాన్సిస్కో నుండి జపాన్ లోని ఒసాకా పట్టణానికి బయలుదెరింది. టేకాఫ్ కాగానే వెనుక వైపు ఉన్న ల్యాండింగ్ గేర్లోని ఒక టైరు ఊడిపోయింది. ఈ టైరు విమానాశ్రయం పార్కింగ్ లో ఉన్న కారుపై పడింది. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కానీ, కారు మాత్రం డ్యామేజీ అయ్యింది. 

 ఇదిలా జరిగినప్పుడు విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు.  టైరు ఊడిన విషయాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే దారిమళ్ళించి లాస్ ఏంజెల్స్ లోని విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. మరో విమానంలో వారిని గమ్య స్థానానికి పంపినట్లు సమాచారం.