
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పురాతన భవనం కుప్పకూలింది. చెరుకుపల్లి కాలనీలో ఓ పురాతన బిల్డింగ్‌కు మరమ్మత్తులు చేస్తుండగా ఒక్క సారిగా కూలిపోయింది. పక్క నున్న 3 భవనాలపై శిథిలాలు పడటంతో పక్క బిల్డింగ్ గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కూలిపోయిన భవనంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పక్క బిల్డింగ్‌లో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు