హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య..

హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య..

హైదరాబాద్ లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి రాయల్ కాలనీలో  సయ్యద్ (28) ఘోరంగా నడి రోడ్డు మీదే హత్య చేశారు. చెంపాపేట్ బాబానగర్ కు చెందిన సయ్యద్ సమీర్ ను రాయల్ కాలనీలో గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. డెకరేషన్ వర్క్ చేసే సమీర్ రాయల్ కాలనీ నుండి ఇంటికి వస్తుండగా హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో చాలా మంది వ్యక్తులు గాంజా సేవించి తరుచు గొడవలకు దిగుతుంటారని ఈ హత్యకు కారణం అదే అయి ఉండవచ్చని స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పొలీసు బృందాని ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు.