- లింగంపల్లిలోని కేఎల్ సీ నిర్మాణ సంస్థలో ఘటన
- సేఫ్టీ పట్టించుకోలేదని తోటి కార్మికులు ఆందోళన
- కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు
చందానగర్, వెలుగు : ప్రమాదశాత్తూ అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి కార్మికుడు మృతిచెందిన ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఖైరుల్మియా(32)కు భార్య, ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు కోసం తన మామతో కలిసి 15 రోజుల కిందట సిటీకి వచ్చి లింగంపల్లిలోని కాండ్యూర్ క్రెసెంట్కేఎల్సీ నిర్మాణ సంస్థలో కూలీగా చేరాడు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఖైరుల్ మియా అపార్ట్ మెంట్30వ అంతస్తులో పని చేస్తూ ప్రమాదవశాత్తు 11వ ఫ్లోర్లో పడిపోయాడు.
అతడికి తీవ్రగాయాలై స్పాట్ లో చనిపోయాడు. దీంతో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతోనే ఖైరుల్ మియా మృతిచెందాడని తోటి కార్మికులు ఆందోళన చేపట్టారు. సంస్థ ఆఫీస్ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులతో నిర్మాణ సంస్థ బందోబస్తు పెట్టింది. కేఎల్సీ నిర్మాణ సంస్థ సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడంతోనే ఖైరుల్ మియా చనిపోయినట్టు అతని మామ మాటియూర్ మండోల్చందానగర్ పోలీసులకు కంప్లయింట్ చేయగా సదరు నిర్మాణ సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చందానగర్ పోలీసులు తెలిపారు.