- టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్
గోదావరిఖని, వెలుగు: ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ కోసం సింగరేణి టెండర్విషయంలో సీబీఐ దర్యాప్తు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం గోదావరిఖనిలోని సింగరేణి జీఎం ఆఫీస్ఎదుట యూనియన్ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఉపాధినిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా నిలిచిన సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ అనే కొత్త విధానానికి తెరలేపి నైనీ బ్లాక్ గనిని దోచుకునే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు టెండర్ల దోపిడీపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, నడిపల్లి అభిషేక్ రావు, కోశాధికారి చెల్పూరి సతీశ్, పొలాడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
