ఇంటర్ బోర్డులో అవినీతిపై ఏసీబీతో విచారణ చేయించాలి

ఇంటర్ బోర్డులో అవినీతిపై ఏసీబీతో విచారణ చేయించాలి

హైదరాబాద్,వెలుగు: ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్​లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీఎం కేసీఆర్ స్పందించి, ఏసీబీతో దర్యాప్తు చేయించాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణగౌడ్ గురువారం ఓ ప్రకటనలో కోరారు. పదవీ విరమణ పొందుతున్న సమయంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ చేసిన ఓడీలు , పదోన్నతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డు సెక్రటరీ డమ్మీ బిల్లులతో తన వెహికల్ రిపేర్​ కోసం  రూల్స్​కు విరుద్ధంగా రూ.2లక్షలు ఖర్చు చేశారని ఆరోపించారు.