
- ఆరుమందికి తీవ్ర, మరికొందరికి స్వల్పగాయాలు
- ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టపై ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఆగిన డీసీఎంను ఆర్టీసీ అద్దె బస్సు ఢీ కొట్టడంతో పలువురికి తీవ్రగాయాలైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఇబ్రహీంపట్నం నుంచి ప్రయాణికులతో ఎంజీబీఎస్‌కు ఆర్టీసీ అద్దెబస్సు (టీఎస్ 07 యూజి 7172) వెళ్తుంది.
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టపై మరమ్మతుకు ఆగిన డీసీఎం (ఏపీ31టీబీ 7610) ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో బస్సులోని పలువురు ప్రయాణికులు, కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిని సిటీలోని ప్రవేట్ ఆస్పత్రికి పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.