హీరోగా నటించిన ‘అనగనగా ఒకరాజు’ చిత్రం సంక్రాంతికి విడుదలై తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100.2 కోట్ల గ్రాస్‌ను సాధించిందని సోమవారం మేకర్స్ ప్రకటించారు. తన కెరీర్‌లో నాలుగో చిత్రానికే నవీన్ వంద కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం.
ఐదు రోజుల్లో రూ.100 కోట్లు, నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్, యూఎస్‌లో హ్యాట్రిక్ మిలియన్ డాలర్, నాలుగు వరుస బ్లాక్‌బస్టర్లతో నవీన్ పొలిశెట్టి అరుదైన ఘనతను సాధించాడు. దర్శకుడు మారి రూపొందించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నారని, ఈ చిత్రానికి మరింత లాంగ్ రన్ ఉంటుందని టీమ్ తెలియజేసింది.
