Gam Gam Ganesha OTT: సైలెంట్గా OTTకి వచ్చేసిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవకండి

Gam Gam Ganesha OTT: సైలెంట్గా OTTకి వచ్చేసిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవకండి

బేబీ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గం గం గణేశా. కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటించారు. యాక్షన్ క్రైమ్ కామెడీ థ్రిలర్ గా వచ్చిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు.. సినిమాకు ప్రేక్షకుల నుండి కూడాపాజిటీవ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది ఈ మూవీ. 

ఇక గం గం గణేశా సినిమా థియేట్రికల్ రన్ ముగియడంతో ఓటీటీ విడుదల కోసం ప్లాన్ చేశారు మేకర్స్. అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దాంతో ఈ సినిమా కోసం చూస్తున్న ఆడియన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఇక థియేటర్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

ఇక గం గం గణేశా కథ విషయానికి వస్తే.. గణేష్ (ఆనంద్ దేవరకొండ) ఒక దొంగ అతని ఫ్రెండ్ (ఇమ్మాన్యుయేల్). చిన్న చిన్న దొంగతనాలు చేసే  గణేష్ శ్రుతి (నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె గణేశ్‌తో కాకుండా వేరే వ్యక్తితో పెళ్లికి రెడీ అవుతుంది. దాంతో.. దాంతో మస్తానానికి గురైన గణేష్  ఆ అమ్మాయి ప్రేమను గెలవాలంటే డబ్బు ముఖ్యమని ఫిక్స్ అయ్యి ఓ డైమండ్ దొంగతనానికి రెడీ అవుతాడు. మరి ఆ తరువాత ఎం జరిగింది అనేది మిగిలిన కథ.