అనన్య కథ మళ్లీ మొదటికి

అనన్య కథ మళ్లీ మొదటికి

లైగర్​ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ అనన్య పాండే(Ananya Panday). ఈ సినిమాతో దారుణమైన ఫెయిల్యూర్​ చూసిన అనన్య తెలుగులో మరో  ప్రాజెక్ట్​కు సైన్​ చేయలేదు. ఇప్పుడు బాలీవుడ్​ సినిమాలపైనే ఫోకస్​ పెట్టింది. ‘ఆషికీ 2’ హీరో ఆదిత్యరాయ్​ కపూర్​తో ఈ అనన్య పాండే ప్రేమలో ఉన్నట్టు కొంతకాలంగా రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. అనన్య ఎవ్వరితోనూ ప్రేమలో లేదని ఆమె తల్లి తేల్చి చెప్పింది. అయినా ఈ రూమర్లకు చెక్​ పడటం లేదు. 

తాజాగా మరోసారి వీరిద్దరి వ్యవహారం హాట్​ టాపిక్​గా మారింది. స్పెయిన్​లో జరిగిన ఓ మ్యూజిక్​ కాన్సర్ట్​కు సంబంధించిన వీడియోను అనన్య సోషల్ మీడియాలో షేర్​ చేసింది. ఆదిత్య సైతం ఈ కాన్సర్ట్​ను ఎంజాయ్​ చేస్తున్న వీడియో పోస్ట్​ చేయడంతో వీరిద్దరూ కలిసే స్పెయిన్​ వెళ్లారని నెటిజన్లు ఫిక్స్​ అయిపోతున్నారు. ప్రస్తుతం ‘డ్రీమ్​ గర్ల్​ 2’ సినిమాలో అనన్య నటిస్తోంది.