
యాంకర్ కం నటి అనసూయ భరద్వాజ్(AnasuyaBharadwaj)క్రేజీ ఫోటలను షేర్ చేసింది. నిత్యం సోషల్ మీడియాను షేక్ చేసే అనసూయ.. మరోసారి తన వైబ్ను చూపించేసింది. మొన్నటి దాకా ఇంట్లో వరుసగా శుభ కార్యాలతో డివోషనల్ టచ్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇపుడీ బికినీ ఫొటోలతో రెచ్చిపోయింది.
లేటెస్ట్గా అనసూయ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అనసూయ తన ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్ వెళ్లిన పలు ఫోటోలను నెటిజన్లతో పంచుకుంది. స్విమ్మింగ్ పూల్లో బికినీ డ్రెస్లో కనిపించి మెస్మరైజ్ చేస్తోంది. సేద తీరే అలల నీటిలో అనసూయ బికినీ వేసి, బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫోజులతో స్టిల్స్ ఇచ్చింది. అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్లో భర్తతో రొమాన్స్ చేస్తున్న ఫొటో వీపరీతంగా వైరల్ అవుతుంది.
శ్రీలంకలోని సింగ్రియా కొండను ఎక్కిన మరుసటి రోజు తాము మొత్తం ఇలా స్విమ్మింగ్ పూల్కే పరిమితమయ్యమనే క్యాప్షన్ తో అనసూయ ఈ ఫొటోలను షేర్ చేసింది. 'ఒక లాంగ్ డ్రైవ్ తర్వాత.. మూడో రోజు ఒక ఉత్తేజకరమైన పూల్ డే..' అంటూ శ్రీలంక అని క్యాప్షన్ జతచేసింది. ఇదిలా ఉంటే ప్రతి రోజూ శ్రీలంక టూర్ డైరీస్ను అనసూయ తన ఫ్యాన్స్ పంచుకుంటోంది.
►ALSO READ | క్రేజీ కాంబో: అజయ్ దేవగణ్‌తో జాకీచాన్.. మాస్ యాక్షన్ ఇంటర్నేషనల్ మూవీ!
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్లు ఎవ్వరికీ నచ్చిన విధంగా వారు కామెంట్స్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు.
ఇలాంటి ఫొటోస్ పోస్ట్ చేస్తే అనసూయకు తెలుగు పేక్షకుల్లోనే కాదు.. సోషల్ మీడియా యూత్లో కూడా మంచి ఫాల్లోవింగ్ ఎందుకుండదు? అని అంటున్నారు. అలాగే, అనసూయ ఏం పోస్ట్ చేసిన, ఇట్టే క్షణాల్లో వైరల్ అవ్వడం మాములే కదా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే, ఇటీవలే మే12న తన భర్త, పిల్లలతో కలిసి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. ఈ సందర్భంగా తన ఇంటికి ‘శ్రీరామ సంజీవని’ అనే పేరు పెట్టింది. తెలుగు సాంప్రదాయం ప్రకారం పాలు పొంగించి నూతన గృహ ప్రవేశం చేసింది. ఇందులో తన భర్త, పిల్లలతో కొత్త ఇంటి ముందు ఉన్న ఫోటోలు పంచుకుంది. ఇంతలోనే హాట్ అందాలతో శ్రీలంక ఫోటోలు షేర్ చేసి కుర్రాళ్లను అలెర్ట్ చేసింది.