
‘ది కరాటే కిడ్’ఫ్రాంచైజీలో వస్తున్న ఆరవ చిత్రం ‘కరాటే కిడ్: లెజెండ్స్’.జాకీ చాన్, యుగ్ బెన్ వాంగ్, రాల్ఫ్ మచియో కీలకపాత్రలు పోషించారు. జోనాథన్ ఎంట్విస్ట్లే దర్శకత్వం వహించారు. ఈనెల 30న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీ హిందీ వెర్షన్ కోసం బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ తన కొడుకు యుగ్‌తో కలిసి వర్క్ చేశారు.
జాకీచాన్ పోషించిన మిస్టర్ హాన్ పాత్రకు అజయ్ దేవగణ్ డబ్బింగ్ చెప్పగా, బెన్ వాంగ్ పోషించిన లీ ఫాంగ్ పాత్రకు యుగ్ డబ్బింగ్ చెప్పాడు. తాజాగా ప్రమోషన్స్‌లో టీమ్‌తో పాటు అజయ్ కూడా పాల్గొన్నాడు.
ఇందులో భాగంగా జాకీ చాన్.. తను అజయ్ దేవగణ్‌తో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్టుగా ప్రకటించాడు. దీంతో త్వరలోనే ఈ క్రేజీ కాంబోలో ఓ చిత్రం రాబోతోందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో పలు ఇండియన్ సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపిస్తుండటం చూశాం. జాకీ చాన్ వంటి హాలీవుడ్ స్టార్ ఇండియన్ సినిమాలో కనిపించడం అరుదైన విషయంగానే చెప్పాలి. మరి ఈ మాస్ యాక్షన్ ఇంటర్నేషన్ కాంబో ఎప్పుడు తెరపై కనపడనుందో చూద్దాం.