
యాంకర్ అనసూయ(Anasuya)పై అల్లు అర్జున్(Allu arjun) ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌పై అనసూయ కామెంట్స్ చేసినట్టుగా ఓ వార్త వైరలవుతోంది. ఓ ఇంటర్వ్యూలో ఈ నటి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ తన యాక్టింగ్, డ్యాన్స్‌ల గురించి ఫ్యాన్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాడని ఒకసారి చేసిన తప్పులు మరోసారి రిపీట్ కాకండా చూసుకుంటాడని ఆమె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది.
పుష్ప(Pushpa)లో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయని వాటి నుంచి నేర్చుకుని పార్ట్ 2లో ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతున్నాడని అనసూయ చెప్పినట్టు ఆ వార్తల్లో ఉంది. దీనిపై తాజాగా అనసూయ క్లారిటీ ఇచ్చింది. తాను అల్లు అర్జున్ గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదని.. ఇదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టిపారేసింది. పుష్పలో ఈ లేడీ యాంకర్ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. మరి సీక్వెల్లోనూ ఈ బ్యూటీకి స్కోప్ ఉంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది.