
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘కె ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండ, శివ బొమ్మకు కలిసి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కిరణ్ లుంగీ కట్టుకుని మాస్ లుక్‌లో కనిపించాడు.
బ్యాక్‌గ్రౌండ్‌లో మందు బాటిల్స్‌తో డిజైన్ చేసిన లవ్ సింబల్ ఉండటం ఆసక్తిరేపుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దీపావళి కానుకగా సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. సతీష్ రెడ్డి మాసం డీవోపీగా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
Promise 🤗#Kramp #KRampFirstLook https://t.co/WZmnbz4TdX
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) June 30, 2025