
ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా లీడ్ రోల్స్‌లో తోట శ్రీకాంత్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘థాంక్యూ డియర్’.మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు వి.వి.వినాయక్ లాంచ్ చేశారు.
నటుడు శ్రీహరి కుటుంబం నుంచి వస్తున్న ధనుష్ రఘుముద్రి హీరోగా గొప్పస్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానంటూ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. టీజర్‌ను లాంచ్ చేసిన వినాయక్‌కు హీరోహీరోయిన్స్‌తో పాటు టీమ్ మెంబర్స్ థ్యాంక్స్ చెప్పారు.
వీర శంకర్, నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత, సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో సినిమా విడుదల కానుంది.
Dynamic director #VVVinayak Garu launched the Teaser of #ThankYouDear this morning! 🎬✨
— Mango Music (@MangoMusicLabel) June 30, 2025
The team is grateful for his warm wishes and support.
Watch the teaser now: 👉 https://t.co/TunR2HgeRg@dhanush_vk @ihebahp #RekhaNirosha #ThotaSrikanthKumar #PappuBalajiReddy… pic.twitter.com/sUWBB1g3M8