మీడియా హౌస్‌‌ల పేరిట స్లాటర్ హౌస్‌‌లు నడుపుతున్నరు : జగదీశ్ రెడ్డి

మీడియా హౌస్‌‌ల పేరిట స్లాటర్ హౌస్‌‌లు నడుపుతున్నరు : జగదీశ్ రెడ్డి

మోదీ, చంద్రబాబు చేతుల్లో రేవంత్ కీలుబొమ్మ: జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మీడియా హౌస్‌‌ల పేరిట కొన్ని సంస్థలు స్లాటర్ హౌస్‌‌లను నడుపుతున్నాయని బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. కుట్రపూరితంగా కేసీఆర్, కేటీఆర్‌‌‌‌పై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఫీనిక్స్ పక్షిలాగా వస్తున్న తీరు.. తెలంగాణ వ్యతిరేకులకు నచ్చడం లేదన్నారు. “రేవంత్ టూల్ మాత్రమే. మోదీ, చంద్రబాబు చేతుల్లో ఆయన కీలుబొమ్మ. 

ఏముంది ఫోన్ ట్యాపింగ్‌‌లో? ఎవడిచ్చాడు సమాచారం? ఏ మహిళైనా తన ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పారా? ఫోన్ ట్యాపింగ్ ఒక పనికి మాలిన కేసు. రేవంత్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని చెప్పగలరా? ఇష్టమొచ్చినట్టు రాసి.. ఇదే జర్నలిజం అంటే ఊరుకోబోం. మిలిటరీ డ్రెస్ వేసుకుని టెర్రరిస్టు వచ్చినట్టు.. మీడియా ముసుగు వేసుకుని మమ్మల్ని కాలుస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. ఆధారాలు లేకుండా వార్తలు రాయటం సరికాదన్నారు.