మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి.. ముగ్గురు యువకులను చితకబాదిన గ్రామస్తులు

మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి.. ముగ్గురు యువకులను చితకబాదిన గ్రామస్తులు

మద్యం మత్తులో వీరంగం.. నానా రచ్చ.. ఫుల్లుగా తాగి బైక్ నడుపుతూ.. హారన్ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్ పై దాడి..తర్వాత గ్రామస్తులతో దేహశుద్ధి.. కరీంనగర్ జిల్లా మొలంగూర్ లో ముగ్గురు యువకులు దాడి చేసిన ఘటన జరిగింది.  వివరాల్లోకి వెళితే.. 

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ లో శుక్రవారం(సెప్టెంబర్ 19) ముగ్గురు యువకులు ఫుల్లుగా తాగి బైక్ నడుపుతూ రచ్చ రచ్చ చేశారు. హుజూరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హుజూరాబాద్ నుంచి జమ్మికుంట వెళ్తుండగా.. మొలంగూరు దగ్గర ఆ ముగ్గురు యువకులు బైక్ పై వెళ్తూ బస్సు అడ్డుగా వెళ్లారు. బస్సు డ్రైవర్ హారన్ కొట్టడంతో మమ్మల్ని చూసి హారన్ మోగిస్తావా అంటూ బస్సు ఆపి వీరంగం సృష్టించారు. డ్రైవర్ పై దాడి చేశారు. 

విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ ముగ్గురు యువకులను అడ్డుకోగా వారిపైనా తిరగబడ్డారు. దీంతో ముగ్గురు మందుబాబులకు దేహశుద్ది చేశారు గ్రామస్తులు. అనంతరం పోలీసులకు అప్పగించారు. 

యువకుల దాడిలో గాయపడిన ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.