మధ్యాహ్నం ఎండ, సాయంత్రం కుండపోత వర్షం.. రిపీట్..! హైదరాబాద్ లో మళ్ళీ మొదలైన వాన.. !

మధ్యాహ్నం ఎండ, సాయంత్రం కుండపోత వర్షం.. రిపీట్..! హైదరాబాద్ లో మళ్ళీ మొదలైన వాన.. !

గత కొద్దిరోజులుగా ఛైదరాబాద్ లో వాతావరణం వింతగా ఉంటోంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా పొడిగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి కుండపోత వర్షం కురుస్తోంది. మాములు కుండపోత వర్షం కాదు.. క్లౌడ్ బరస్ట్ ని తలపించే రేంజ్ లో వర్షం కురుస్తోంది. చాలా ఏరియాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ తో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాదాపు ప్రతిరోజు ఇదే సీన్ రేపేటవుతోంది. శుక్రవారం ( సెప్టెంబర్ 19 ) కూడా ఇదే సీన్.. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయి వర్షం మొదలైంది. 

ఉప్పల్, నాగోల్, కప్రా, ఎల్బీనగర్, వనస్థలిపురం, హాయత్ నగర్, సరూర్ నగర్, చాంద్రాయణగుట్ట, దిల్ సుఖ్ నగర్, కొత్త పేట,మలక్ పేట ,సైదాబాద్, మదన్నపేట, చాదర్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ, గుర్రంగుడా, బిఎన్ రెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా  వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వర్షం కురుస్తున్న ఏరియాల్లో ట్రాఫిక్ స్తంభించి జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

పలు చోట్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఓ మోస్తరుగా మొదలైన వర్షం రాత్రికి మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే బయటికి రావాలని సూచిస్తున్నారు అధికారులు. రోడ్లపై వాటర్ లాగింగ్ సమస్య తలెత్తే అవకాశం ఉన్న క్రమంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

సిటీ శివారు ప్రాంతాల్లో మొదలైన వర్షం రాత్రికి సిటీ మొత్తం వ్యాపించే అవకాశం ఉన్న క్రమంలో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు త్వరగా ఇళ్లకు చేరుకోవాలని.. వర్షం కురిసే సమయంలో నీరు నిలిచి ఉన్న రోడ్లపై వెళ్లే సాహసం చేయద్దని సూచిస్తున్నారు అధికారులు. కాసేపు ఆగి.. రోడ్లపై ఉన్న నీళ్లు తగ్గిన తర్వాత వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు.