ఘట్ కేసర్ మెగా ఇంజనీరింగ్ కాలేజీలో..ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

ఘట్ కేసర్ మెగా ఇంజనీరింగ్ కాలేజీలో..ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ లో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం(సెప్టెంబర్19) ఘట్ కేసర్ పరిధిలోని ఎదులాబాద్ మెగా ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన చింతకుంట్ల తులసి అనే విద్యార్థిని ఉరివేసుకొని మృతిచెందింది. 

హాస్టల్ లోని తన గదిలో తులసి ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయింది. సమాచారం అందుకున్న ఘట్ కేసర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల శాంతినగర్ కు చెందిన విద్యార్థిని తులసి మెగా ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్ ఈ డిప్లామా చదువుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.